Thursday, April 2, 2020

🙏🙏🙏

రామానామం వాడినోడ్ని జాతిపితని చేశాము, రామునింటిని కట్టడానికి ఇన్నాళ్ళు వేచాము.
విదేశీయునికి వోంగి గులాములయ్యాము, రామరాజ్యాన్ని అటకనేక్కంచాము.

 

తెల్లోడుకూడా మోక్కాడు రామునికి, మనం మాత్రం మరచాము అతని ఉనికి.

 

రాజ్యాంగంపై మిగిలావు బొమ్మగా ఓ రామా, నీ పేరెత్తితే మాత్రం చేస్తారు పేద్ద హంగామా.

 

భువనైక పాలకునికి భుమి కరువాయె, రహదారి మఱ్ఱి నీ నీడగా మిగిలె
సీతమ్మ వనవాసం ముగిసెనేమోగాని, ఆ తల్లి కష్టాలు ఇంకా మిగిలె.

 

ప్రతి యేటా చేస్తాము నీ కళ్యాణం, మామక్కువ ఉత్త వడపప్పు పానకం.
నే పేరున వసూలు చేస్తాము కనకం, నీవు మాత్రముండవు మాకు ఙాపకం.

 

ఇదయ్యా మా బ్రతుకు ఓ రామా, ఐనా నీకు మాపై ఇంత ప్రేమా!!!!

Friday, June 3, 2016

శభాష్‌రా నరుడా!!!!!!!!

మంత్రికాడ మందలాయె, బడులన్నీ బందులాయె
పంతులోరు పావులాయె, రచ్చకెక్కె బిడ్డలాయె

ఙాన శూన్యుల గోష్ఠి జేసె, ఙానులాడ గొఱ్ఱెలాయె
యంత్రాల మోజులాయె, కుతంత్రాల కాలమాయె

ఆలి అంటె చులకనాయె, సానికొంప కోవెలయె
అమ్మ ప్రేమ చేదాయె, ఆచారం వెగటాయె

మాతృభాష మరుగాయె, పరుల యాస మోజాయె
వినాశనం వేడుకాయె, దెయ్యం మాట వేదమాయె

శభాష్‌రా నరుడా!!!!!!!!

Tuesday, February 24, 2015

భధ్రం నేస్తం...

భధ్రం నేస్తం...

బలిదానాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న స్వరాజ్యం,
ఏళ్ళు శ్రమపడి కాపాడుకున్న సంస్కృతి సంప్రదాయం
వ్యెయప్రయాసలనోడ్చి సంపాదించుకున్న నీ ప్రతిష్ఠ,
అన్నీ ఒక్క పూటలొ దోచుకు పోవ గజదొంగ నక్కున్నాడు ఆ పక్క.

జర భధ్రం నేస్తం...

శ్రమించి సంపాదంచిన స్తితిగతులూ,
చెమటోడ్చి నిలబెట్టుకున్న నీ స్వప్నసౌధం ,
సెటైర్లను లెక్కించక చాటిజూపిన నీ ప్రతిభ,
అన్నీ త్రోసిపుచ్చి  దొడ్డి దారిన నీనెత్తెక్క గుంటనక్కున్నాడు  నీ పక్క

మహా భధ్రం నేస్తం...

కంటిపాపలా కాచుకుంటున్న నీ చంటి పాపలను,
గుండెల్లొ పెట్టి పెంచుకున్న నీ ఆడబిడ్డలను,
ప్రేమానురాగాల గౌరవ మర్యాదల కొలువైన నే ఇంటి పెద్దలను,
అందరినీ నీకు దూరం చేయ కౄరమృగం వేచివుంది పొదవెనుక

భధ్రం నేస్తం... జర భధ్రం నేస్తం...

Monday, February 9, 2015

మనోవేదన....

రాయిని మొక్కితే "రోగమా?" అన్నారు,
ప్రకృతిని ప్రార్ధిస్తే, "పైత్యమా?" అన్నా రు,
భ్రాతృత్వాన్ని ప్రొత్సహిస్తే పాతపోకడన్నారు,
ప్రేమ ని పంచితే వ్యామొహమన్నారు.

అనంత శక్తిని ఆరాధిస్తే అహంకారమన్నారు,
జీవకారుణ్యం జంతు ప్రేమ జడత్వమన్నారు,
దైవత్వానికి కైమోడ్చడం దాశ్యమన్నారు,
వసుధైక కుటుంబకం అంతే వెర్రివాడన్నారు,

అట్టి ప్రబుధ్ధులే....

మత్తున మునుగుట మనుగడన్నారు,
వ్యసనాలు, వాంఛలు వ్యవహరశైలన్నారు,
పరులను పీడించుట పురోగమనమన్నారు,
నీతీనియమాలను పక్కనబెట్టి బరితెగించుట బ్రతుకన్నారు,

అన్యుల సంపదనుభవిస్తూ ఆనందిచమన్నారు,
అందివొచ్చిన అందాన్ని అనుభవించమన్నారు,
శక్తిగ పూజించాల్సిన స్త్రీని అంగడి బొమ్మగ అమ్మేశారు,
పచ్చగ ఉందల్సిన ప్రకృతిని ప్రళయించేలా  చేశారు....

అయోమయం లొ పడ్డ నాకు కాస్త మార్గం చూపరూ....

Thursday, July 25, 2013

ఓ కవితా....

అవ్యక్తం గా మిగిలిన వ్యక్తిత్వానికి భాష్యం చెర్చె వ్యాకరణానివి నువ్వు
విరక్తి చెందిన మనసుల అనురక్తి మొలకెత్తించు ఆహ్లాదానివి నువ్వు
జడప్రాయ్ముగ మిగిలిన జీవుల చైతన్యులు చేయు సత్తువ నువ్వు
ప్రస్తుతాన్ని భరించలేని కవి ఆవేశానివి నువ్వు


మాతృ వాత్సల్యన్ని వర్నించ నిరంతర ప్రయత్నానివి నువ్వు
ప్రేయసికి ప్రెమను తెలుపగోరు హ్రుదయాల సంగీతానివి నువ్వు
బిడ్డ బోసినవ్వులు జూచి మైమరచిపొయే తండ్రి ఆనందానివి నువ్వు
ఆనంద రాగాలు వినిపించు మోజీరనాదానివి నువ్వు

ఓ కవితా..నాలొని ప్రతి భావానికి రూపం నువ్వు...

Thursday, February 14, 2013

ఈ సమాజం నాకొద్దు...

రచ్చబండన చ్చచ్చు కబుర్ల కాలయాపన చేయు చవటల సమాజం నాకొద్దు
సాధన వీడి సార్ధకతకు నీళ్ళొదిన యువత తిరుగాడు సమాజం నాకొద్దు
మేధవులిమడలేని మఱుభూమిని పోలు సమాజం నాకొద్దు
సృజనాత్మతకు తొడు రాని, నీడనివ్వని గొఱ్ఱెల మందల సమాజం నాకొద్దు

గాంధీకుసైతం హింసనంటింపగల నీచులనీడనుందు సమాజం నాకొద్దు
హరిశ్చంద్రుని సైతం అసత్యవాదిగా ముద్రించగల మూర్ఖుల తోడుండు సమాజం నాకొద్దు
పసివానిచేత మఱ్తుపాకులుంచి సంబరపడు మహామహులుండీ సమాజం నాకొద్దు
పట్టెడు మెతుకులకై పరులప్రాణం తీయించు దొరల పాలననున్న సమాజం నాకొద్దు

పడచుల పరువుగా తిరుగాడలేని కీచకులు నిండిన సమాజం నాకొద్దు
పసిబిడ్డలపై సైతం అకృత్యాలు చేయు కౄరుల కాపుగాచు సమాజం నాకొద్దు
భగవంతునినే భయపెట్టగల భ్రష్ఠులు తిరుగాడు భుభాగమేదీ నాకొద్దు
సొంతవారే గొంతునులుము కుటుంబకం నాకొద్దు....

Sunday, April 8, 2012

నీకొసం నేను ఇలా ఇలా...



యెదలొతుల మధుగీతంలా, సుమమాలల దివితారకలా
పరవళించిన ప్రకృతిలా, పులకించిన కన్నె మనసులా
పలకరించె నెస్తంలా, పలికించె జీవంలా
నాలోని ఈ భావంలా, నీకొసం నేను ఇలా ఇలా...