Wednesday, March 14, 2012

ఉగాది శుభాకాంక్శలు....

చిగురాకుల చిరు తొరణాలు, చిరుమావిళ్ళ నిండు కావడులు
చీనాంబారాల అలంకరణల శోభిల్లుతున్న సిరుల ప్రసాదించు సురులు

చిలకపచ్చ పావడాల పడచులు, చిందులతొ హోరెత్తించు చిన్నారులు
చిగురులు తొడిగి పచ్చదనాన పరవసించి మురిపించు ప్రకృతి సొగసులు

చేత వాద్యాలు పట్టి యజమానుల మెప్పుగొరవచ్చు గీతగాళ్ళు
చిత్రాలంకరణల శోభతొ పురప్రజల దీవించవచ్చు గరగలు

షడ్రుచుల సంగమముగ చేయు పత్యేక పచ్చడి నిండిన పాత్రలు
అవి వడ్డిస్తూ సకలైశ్వర్యాలు కలుగు జీవితం పొందమని ఆశీర్వదించు మాతృమూర్తులు

పంచాంగాలు చెతబట్టి వివరించ వచ్చు విపృలు, శ్రధ్ధగా విను పురప్రజలు
లోకకళ్యాణార్ధం సత్ ప్రవచనములు వల్లించు విఙులు, పురోభివృధ్ధికై యోచించు పాలకులు

పట్టువస్త్రల ధరించి పిల్లలను ఆశీర్వదించు పెద్దలు, వారి నుండి కానుకలు పొంది మురుయు పసివాళు
కొరమీసల రొశాలు చాటుతూ తిరుగు కుర్రవాళ్ళు, కొత్త వస్త్రాలు సొగసుల మురుయు బంధుమితృలు

అత్తవారింట అందాలు అలంకరించు కొత్తకోడళ్ళు, బావల ఆటపట్టించు ప్రయత్నాల మునుగు మరదళ్ళు
యెన్నొ, యెన్నెన్నొ మధుర స్మృఉతులు మహదానందకారకాలు...

శ్రీనందన ఉగాది పండుగ తెలియపరచు నూతనవత్సర ఆనందభరితమవ్వాలని ఆకాంశిస్తూ, అందరికి ఇవే మా శుభాకాంక్శలు....