Friday, February 3, 2012

వందేమాతరం అని వందనం చేయటం....


వందేమాతరం అని వందనం చేయటం వారి Fashion కి అడ్డొస్తోంది
జన గణ మన పాటలొ వారికి కావల్సిన Beat కరువౌతంది
ఆనాటి పోరుగాధలు వినటానికి వారికి Masala లేదనిపిస్తోంది
ఈ తరం ఎటు పొతోంది, మన దేశం గతి ఎలా మారనుంది?

వసంతాల వాకిట కోయిల గానం కరువాయే....


వసంతాల వాకిట కోయిల గానం కరువాయే
సుమలతల పొదరింట సౌరభాల జాడలేకపోయే
యాంత్రిక జీవన ఘోషలొ నా అరుపు నాకే వినపడలేదాయే
మదిలోని బాధను కన్నీట కరిగంచ తీరికేలేకపోయే

ఓ హనుమయ్యా..


ఓ హనుమయ్యా... ఓ హనుమయ్యా...

రామనామమే జపియించవయ్యా
రామభక్తిలొ మునిగావయ్యా
రామబానము కన్న రామనామమె మిన్నని ఱుజువుజెసిన ఘనుడివయ్యా.. ||ఓ హనుమయ్యా...||

ఈశ్వరాంశతొ పుట్టావయ్యా
కేసరినందనుడు నీవెనయ్యా
అంజని దేవికి కలలపంటవు,వాయుదేవునికి మానసపుతృడువయ్యా..||ఓ హనుమయ్యా...||


సీతమాతను వెతకగ రామునివెంట నడిచావయ్యా
శతయోజనముల వారిధి దాటి సేతజాడ కనిపెట్టావయ్యా
రామదూతగా లంకనుచేరి రామకార్యము నిరవేర్చావయ్యా
లోఖిణిని చంపి లంకను కాల్చి రావణ గర్వము దించావయ్యా..||ఓ హనుమయ్యా...||