Saturday, January 14, 2012

సంబరాల సంక్రాంతి, జగమంతా శుభశాంతి..


సంబరాల సంక్రాంతి, జగమంతా శుభశాంతి

తొరణాల లొగిళ్ళు, రంగవల్లుల ముంగిళ్ళు
పాడి పంటల పచ్చదనం తొ ముస్తాబైన పల్లెలు
శుభసూచకంగా పాలు పొంగించు పడచులు
పిల్లల ఆటపాటలతొ అలరారె మండువాలు

కొడిపందాల తొ కాలంగడిపె పొటుగాళ్ళు
ఆశీర్వదించ వాకిళ్ళు చెరిన గంగిరెద్దులు
గ్రామదెవుని ప్రతిరూపంగా వీధులు తిరిగె గరగలు
పూజలందుకొన సింగారించబడ్డ గొమాతలు

Wednesday, January 4, 2012

నా కన్నా...


ఆదమరచి నిదురపో నా కన్నా
దిగులెందుకే తొడుండగా మీ నాన్న ||ఆదమరచి...||

ఆడుకోవాలనుకునే నీకు నువ్వు మెచ్చె బొమ్మనవ్వనా
ఆటలాడి అలసిన నీకు అలరించె పానుపవ్వనా
కనుపాపనై నీకు కమ్మని కలల లోకం చూపనా
కనురెప్పనై నా ఈ కంటిపాపకు కావలుండనా||ఆదమరచి...||

అందరాని అందలాలు అందుకోవలనుకున్నా
నిచ్చెనై నిల్చి నీ చేతికి వాటినందించనా
సాహసించి సాగరాలు నువ్వు దాటలనుకున్నా
నీ ఆశలు నిరవెర్చె వారధినై నే నీకొసం నిలబడనా||ఆదమరచి...||