Wednesday, December 28, 2011

నా దేశం.....


రక్కసి రాజుల రాచరికాన కూడా చక్కని జీవితం గడిపిన ప్రజలు
రాజకీయ రక్కసుల పాలనలొ పడుతున్నరు చిత్రవ్యధలు

విదేశీయుల పాలనలొకూడా ఖ్యాతిని నిలుపుకున్న నా దేశం
దెశీయ నాయకుల ధన దాహానికి ఓడి మిగిలినది శిధిలమైన సశేషం

పదవుల కన్నా ప్రజలే మిన్న అని నమ్మిన నాయకుల వెంట నడచి దాశ్యశృంఖలాలు తెంచుకున్న నా మాతృభూమి
పదవులకై కుమ్ములాడు తన కుపుతృల ఏలికలొ తెంచుకొజాలని వలయంలొ పడి విలవిలలాడుతున్నది

Monday, December 26, 2011

సత్యాగ్రహినయ్యను నేను......

కాలే కడుపుల మడతులలొ సడలుతున్న బ్రతుకులు చూసిన నేను
బొసినవ్వుల పసితనం బండ్రాళ్ళ నడుమ నలుగుట చూసిన నేను
భవ్య భరతాన్ని కాంక్షించి బదులడిగి విసిగిన నేను
లంచాల  సంచులు నిండుట సహించలెని నేను
అక్రమాల అంతస్థుల అడ్డుగొడ ఊహించని నేను
అసత్యాల అతుకులతొ విసిగిన నేను
సత్యంకై ఆగ్రహించి సత్యాగ్రహినయ్యను నేను.

Saturday, December 24, 2011

మన సంస్కృతికి అభివందనం....


కరమున భుజమును తట్టి, కోరమీసమున పొగరును చూపినా
ఆహార్యమున గాంభీర్యం తలపించి, సాహసముగ రొమ్ము చుపినా
చల్లని చూపుల కరుణ, తియ్యని మాటలందు ఆప్యాయత
మనసున శాంతి సౌభ్రాతుత్వం నేర్పిన, మన సంస్కృతికి అభివందనం....

గగనం గమనం.....


గగనం గమనం కమ్మని కవనం
మానస కధనం సాగర మధనం
అధరం మధురం కోరిన స్వప్నం
పరిమళ పుష్పం ప్రకృతి ప్రణయం

జీవితాన జీవం కరువయ్యిందా?


జీవితాన జీవం కరువయ్యిందా?

కమ్మని పెసరట్టునిదిలి పిజ్జా అంటూ పరుగులెత్తుతున్నాం
చల్లని పైరగాలినొదిలి ఎసి లొ సెదతీరుతున్నాం
అమ్మ వొడికి దూరమై ఆమెకే ఓ రొజు కెటాయించల్సిన స్తితిలొ ఉన్నాం
గౌరవాప్యాయతల మాటలు మరచి రెండు ముక్కల పలకరింపులపాలైపొయాం

ముఖ్యంగా...
జీతం లొ జీవితాన్ని వెతుకుతున్నాం

ఎక్కడ....ఎక్కడ.....????


ఎక్కడ....ఎక్కడ.....

రక్తానికి స్వతంత్ర్యం బదులుగ ఇస్తానన్న బొసు భ్రాతృనికి బహుపరక్కులెక్కడ,
మిరపటపా తొ పరప్రభువుల ముచ్చెమటలు పట్టించిన మన్యం దొరకు మాలలెసెదెక్కడ,
తూటాల తెడాతొ తిరుగుబడ్డ సిపాయిలకు సలాములు చెసెదెక్కడ,
పసికందును పమిటను కట్టుకుని కదనరంగాన కవాతులు చేసిన లక్ష్మికి లాంఛనాలు జరిపెదెక్కడ,
కొలువుదీరిన కోర్టు గదిలొ బాంబు వెసి డమ్ము చాటిన సింగు సోదరునిని శహభాషన్నదెక్కడ,
ఆజాదీ నా ఇంటి పేరన్న చంద్రునికి చెతులెత్తి మొక్కెదెక్కడ????

ఊహ....


అవ్యక్త ఆశల ఊహాచిత్రంలొ, గమ్మతుగ కదలిన కలల వర్ణమా
కావ్యోక్తుల కసరత్తుల కబంధనాన, కనుమరుగైన నీవె జీవమా
యెధెఛగా సాగజూచిన పయనాన, దారిచూపనిల్చిన చుక్కనివా
వీణాపాణి మెచ్చు ముత్యాలొలికించగల, కవి కర మహిమాన్విత ఆభర్ణమా

Sunday, August 14, 2011

తరం మనది.....


అంబరాల అంచులు తాకిన తరం మనది
ఆశయాల గగనంలొ ఎగిరె తరం మనది
విఙుల ఙానానికి అభివదించిన తరం మనది
పొందిన ఙానాన్ని పలుదిశలా వ్యాపించిన ఘనత మనది

మెధస్సుతొ జగాన్ని పాదాక్రాంతం చేసుకున్న తరం మనది
మంచి మనస్సుకు పాదాభివందనం చెసే మనం మనది
భావితరాలకు బంగరు బాటవెసే ధ్యెయం మనది
బంగరులొకాల కాంక్ష నిండిన నయనం మనది

అయినా....
భ్రష్టాచార ఎలికను భరిస్తున్న బ్రతుకు మనది
అత్యచారాల అధికారంలొ అణగారుతున్న జీవనం మనది
కుతంత్రాల కుమ్ములాటలొ నలుగుతున్న జగం మనది
అక్రమార్జనపరుల ఆశలకు అప్పుకడుతున్న తరం మనది

అయినా....
కత్తితొ కాదు కలం గళం తొ మార్పుతేవాలన్న తరం మనది
దాశ్యం కాదు ధైర్యంతొ బ్రతకాలన్న గళం మనది
పరిశ్రమ తొ మాతృభూమికి పూర్వవైభవం తేవాలన్న కాంక్ష మనది
కడుపు కాలుతున్నా కసాయివానికికూడా కడుపు నెంపే మనం మనది

అందుకే.....
ఈ భవ్య భుమికి ప్రియమైన తరం మనది
పొరుగు వానికి ఆదర్శంగా నిలిచిన ఘనత మనది
అంబరాన సురలు సాహో అన్న తరం మనది
కలల లొకాల పయనాన్ని నిజం చేయు భాగ్యం మనది

Friday, August 12, 2011

శయనాకాంక్ష....


స్వర్ణారుణ కాంతులు నిండ అంబరము పుత్తడి ఛత్రమోలెదోచె
వినువీధిన విహంగ ధ్వనులు సుస్వరసమ్మెళనమోలెదోచె
శీతల నదీ తీరాన పచ్చిక మెత్తని దల్పమోలెదోచె
స్వప్నలొకాల దిరిగి అలసిన నా మది ఇట్టి సౌఖ్యాల నడుమ విశ్రాంతిగోర
నె మరి కొంత సమయము శయనించదలచా......

Thursday, August 11, 2011

Naa Preyasi

పసిడి కంకుల అంచుగా, పచ్చని పైరె పావడాగా,


నీలాకశమె పైయ్యదగా, కారు మబ్బులె కురులుగా, 


సూర్య చందురలను సిగను ముడిచి, గొధూలె పారాణీగా కదలివొచ్చె 


నా ప్రక్రుతి చెలిని చుసిన కనులు వెరె ఎ అందాలను చూడగొరునా?...

Naa Modati Post ee Blog lo

పసిడి కంకుల పచ్చికబైళ్ళు, 


పసి పాపల బోసి నవ్వులు, 

పచ్చని తోరణాలు కట్టిన ముంగిళ్ళు,

పట్టు పావడలలో సందడిగా తిరిగే పడచులు,

రంగుల రంగవల్లులు, ....

ఎన్నో ఎన్నెన్నో అందాలు పోదిగున్న స్వర్గాలు మన పల్లెసీమలు, 

ఎన్నని వర్నించగలం, ఏమని కీర్తించాగలం ఆ భూతల స్వర్గాల