Sunday, August 14, 2011

తరం మనది.....


అంబరాల అంచులు తాకిన తరం మనది
ఆశయాల గగనంలొ ఎగిరె తరం మనది
విఙుల ఙానానికి అభివదించిన తరం మనది
పొందిన ఙానాన్ని పలుదిశలా వ్యాపించిన ఘనత మనది

మెధస్సుతొ జగాన్ని పాదాక్రాంతం చేసుకున్న తరం మనది
మంచి మనస్సుకు పాదాభివందనం చెసే మనం మనది
భావితరాలకు బంగరు బాటవెసే ధ్యెయం మనది
బంగరులొకాల కాంక్ష నిండిన నయనం మనది

అయినా....
భ్రష్టాచార ఎలికను భరిస్తున్న బ్రతుకు మనది
అత్యచారాల అధికారంలొ అణగారుతున్న జీవనం మనది
కుతంత్రాల కుమ్ములాటలొ నలుగుతున్న జగం మనది
అక్రమార్జనపరుల ఆశలకు అప్పుకడుతున్న తరం మనది

అయినా....
కత్తితొ కాదు కలం గళం తొ మార్పుతేవాలన్న తరం మనది
దాశ్యం కాదు ధైర్యంతొ బ్రతకాలన్న గళం మనది
పరిశ్రమ తొ మాతృభూమికి పూర్వవైభవం తేవాలన్న కాంక్ష మనది
కడుపు కాలుతున్నా కసాయివానికికూడా కడుపు నెంపే మనం మనది

అందుకే.....
ఈ భవ్య భుమికి ప్రియమైన తరం మనది
పొరుగు వానికి ఆదర్శంగా నిలిచిన ఘనత మనది
అంబరాన సురలు సాహో అన్న తరం మనది
కలల లొకాల పయనాన్ని నిజం చేయు భాగ్యం మనది

No comments:

Post a Comment